ఆటో కార్మికులకు అండగా టీడీపీ ప్రభుత్వం

ఆటో కార్మికులకు అండగా టీడీపీ ప్రభుత్వం
ఇద్దరు నిరుపేద ఆటో డ్రైవర్లకు కొత్త ఆటోలు అందజేసిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : ఆటో కార్మికుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఇద్దరు నిరుపేద ఆటో కార్మికులకు కొత్త ఆటోలను అందజేశారు.
ఆదిబాబు, చంద్రశేఖర్ వర్మ అనే ఇద్దరు ఆటో డ్రైవర్ల ఆర్థిక అభివృద్ధి కోసం సహాయం చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుని వారంలోనే కొత్త ఆటోలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వయం ఉపాధి ద్వారా పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఆటో కార్మికుల జీవనోపాధి మెరుగుపడేందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్న, ముని అప్పలస్వామి, అప్పలనాయుడు, రాజేష్, పెద్ది హరీష్, మాల్యాద్రి, బెవర సూరి, డీడీ నాయుడు, ఆటో కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
