ఘ‌నంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

ఘ‌నంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

మధ్యాహ్న భోజన తనిఖీలో చిన్నారులు

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పాలడుగు ప్రాధమికోన్నత పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు జిల్లా కలెక్టర్, డీఈవోగా, ఎమ్మెల్యేగా, హెచ్ ఎం గా, ఉపాధ్యాయులుగా తమ పాత్రను పోషించారు. ఉపాధ్యాయుల వేషధారణలో మధ్యాహ్న భోజనాన్ని సైతం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమలాకర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం వెంకటగిరి, రాములు, విజయ, ప్రశాంతిలు అభినందించారు.

Leave a Reply