మహిళా సాధికారతే లక్ష్యం..

మహిళా సాధికారతే లక్ష్యం..

  • మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ
  • సర్పంచ్ అబ్దుల్ రషీద్

ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఊర్కొండపేట గ్రామంలో శుక్రవారం మహిళా సంఘం భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్ భూమి పూజ , శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ…..మహిళా సంఘాల సభ్యులు తమ సమావేశాలను,ఇతర కార్యకలాపాలను సొంత భవనంలో నిర్వహించుకోవడం వల్ల వారి ఆర్థిక,సామాజిక సాధికారత మరింత మెరుగుపడుతుంది. గ్రామ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంది, ఈ భవనం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

నియోజకవర్గ శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి సహకారంతో ఊర్కొండపేట గ్రామంలో మరిన్ని అభివృద్ధి చేపడతామని ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ మహేందర్,ఉప సర్పంచ్ శ్రీనివాస్ ,పంచాయతీ కార్యదర్శి ఇబ్రాహీం, వార్డు సభ్యులు రామాంజనేయులు, సహదేవ్, నాయకులు , యువకులు పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply