పసిపాపను హత్య చేసిన ఘటన నిధింతులను శిక్షించాలి..

కడెం(నిర్మల్ జిల్లా) ,ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రజక కులానికి చెందిన కీర్తన కుటుంబం పై అగ్రకులాలకు చెందిన నాయకులు దాడి చేసి రెండు నెలల పసిపాపను హత్య చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని బీసీ సంఘం నాయకులు,రజక కుల సంఘం మండల నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా,కడెం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ప్రభాకర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.

అనంతరం బీసీ సంఘం నాయకులు రాపర్తి వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం వెంటనే ఫాస్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్షలు అమలు చేసి, ఉరి తీయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు గడప దేవరాజ్ బొమ్మెనసాగర్ రజక కుల సంఘం మండల నాయకులు నేరెళ్ల రాజు జాలిగామ నరసయ్య జాలిగామ రంజిత్ ఎం ఆర్ పి ఎస్ మండల నాయకులు పడిగెల రాజు సిహెచ్ రాజేష్ చింటూ మైనార్టీ నాయకులు షాకీర్ బాబా ఎండి నదీ మోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply