Dasturabad నూతన ఏఈఓ సాయికృష్ణకు ఘన సన్మానం

Dasturabad నూతన ఏఈఓ సాయికృష్ణకు ఘన సన్మానం

  • గ్రామ సభలో శాలువాతో సత్కరించిన సర్పంచ్ గంగన్న

దస్తూరాబాద్ (Dasturabad), ఆంధ్రప్రభ

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా దేవునిగూడెం గ్రామ సభలో దస్తూరాబాద్ క్లస్టర్ నూతన ఏఈఓ సాయికృష్ణకు ఘన సన్మానం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఈఓ సాయికృష్ణను సర్పంచ్ ఎండపెల్లి గంగన్న శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవసాయ సంబంధిత సేవలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఏఓ మానస, ఉప సర్పంచ్ గంగన్న, వార్డు సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply