మక్తల్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

మక్తల్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా
- మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీని రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు అన్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం మక్తల్ పట్టణంలోని 9, 10 మున్సిపాలిటీ వార్డు లలో సుడిగాలి పర్యటన చేశారు. అయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం పనులు నిరంతరం జైసామని భరోసా ఇచ్చారు. ఎక్కడ సమస్యలున్న నేరుగా సముద్రం తీసుకోవాల్సిందిగా ఆమె ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు మాట్లాడుతూ నాటి పాలకుల పరిపాలనలో మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మక్తల్ మున్సిపాలిటీలోని 16 వార్డులను సైతం అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తానని అన్నారు.
మక్తల్ మున్సిపాలిటీ తో మొదలుకొని నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి తో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారములో ఉండడంతోటి అభివృద్ధి అనేది ఎంతో సులువుగా జరగబోతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్న విషయము తెలిసిందేనని అన్నారు. ఇందులో భాగంగానే మక్తల్ మున్సిపాలిటీలోని 16 వార్డులలో సైతం సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్ వంటి సమస్యల తొలగింపుతో పాటు దోమల బెడదను నివారించే విధంగా చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు.
ఇంత చక్కటి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తూ మక్తల్ మున్సిపాలిలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు, పెద్దలు సూచనలతో పాటు అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు , మున్సిపల్ వైస్ చైర్మన్ శైవిరెడ్డి, కౌన్స్ లర్ చెన్నమ్మ నీలప్ప, కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి , వాకిటి హన్మంతు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు ,వాకిటి శ్యామ్, భీమేష్, కల్లూరి గోవర్ధన్, భాస్కర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
