అదుపుతప్పి కారు బోల్తా….

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామ శివారులో బుధవారం కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. బోర్ల గూడెం నుండి భూపాలపల్లి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది.కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
