Crime | మందుబాబుకు 30 రోజుల జైలు శిక్ష…

Crime | మందుబాబుకు 30 రోజుల జైలు శిక్ష…

  • ఓరుగల్లులో అరుదైన తీర్పు
  • డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వాహనదారుడు
  • 11 సార్లు పోలీసులకు పట్టుబడ్డ దేవయ్య

Crime | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : మద్యం మత్తులో వాహనం నడుపుతూ 11 సార్లు పట్టుబడ్డ మందుబాబుకు 30 రోజుల జైలు శిక్షను విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్.ఫాతిమా చిన్నప్ప తీర్పునిచ్చారు. ఓరుగల్లు మహా నగరంలో ఇప్పటి వరకు మూన్నాలుగు రోజులకు మించి జైలు శిక్షలకు మించి విధించలేదు.

వ‌రంగ‌ల్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మందు బాబుకు 30 రోజుల జైలుశిక్ష పడింది. సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు కాజిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రెగ్యులర్ చెకింగ్ లో పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన శివరాత్రి దేవయ్య అనే వ్యక్తి మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు.

ఇప్పటి వరకు 11వ సారి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు.సదరు వాహనదారున్ని బుధవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. సదరు బైక్ రైడర్ కు 30రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్.ఫాతిమా చిన్నప్ప తీర్పు నిచ్చారని కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ పిట్టల వెంకన్న తెలిపారు.

Leave a Reply