చిన్నారి మృతి సంఘటన సీఎం దృష్టికి తీసుకెళ్తాం

చిన్నారి మృతి సంఘటన సీఎం దృష్టికి తీసుకెళ్తాం

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో ఈనెల 18న జరిగిన జాతర ఘటనలో సమగ్రమైన దర్యాప్తు చేసి దోషులు ఎవరైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ,ఈ విషయాన్ని ముఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ హామీ ఇచ్చారు.
సోమవారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వంశీకృష్ణ మాట్లాడారు.

చిన్నారి మృతి చాలా దురదృష్టకరమని, బాధాకరమని, దీనిపై చింతిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో కారణాలు ఏవైనా ఒక చిన్నారి మృతి చెందడం బాధాకరమన్నారు. గొడవల కారణంగా చనిపోతే కచ్చితంగా వారికి శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పారు. దోషులు ఎవరైనా చర్యలు చేపడతామని తెలిపారు .ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రభుత్వం పక్షాన త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని ,ఆర్థికంగా కూడా సహాయం అందిస్తామని వంశీకృష్ణ హామీ ఇచ్చారు .రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆ కుటుంబం కోసం ఏం చేద్దామని ఆలోచన ఆదుకోవడానికి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధుల ను బద్మానం చేయడానికి రాజకీయ మైలేజ్ కోసం నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యుడు మరీ జనార్దన్ రెడ్డి చేయడం తగదని చెప్పారు .ఆయన కాలంలో నియంతృత్వ పోకడ అందరికీ తెలిసిందేనని ఆయన చేసిన అరాచకాలు కేసులు పెట్టడం అందరికీ తెలిసిన విషయమేనని రాజకీయం చేస్తే తాము కూడా ఆయన లెక్కలు తీస్తామని వంశీకృష్ణ హెచ్చరించారు .

ఈ సంఘటనపై నాగర్ కర్నూల్ డిఎస్పి తో ఫోన్లో వంశీకృష్ణ మాట్లాడి ఈ కేసులో ఎవరున్నా రాత్రి లోపల అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి .మార్కెట్ చైర్మన్ రమణారావు .నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ సునీం,ద్ర,వైస్ చైర్మన్ బాదం రమేష్, కాంగ్రెస్ నాయకులు బండ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply