bjp l మక్తల్ అభివృద్ధి కోసం బిజెపికి అవకాశం ఇవ్వండి ….

bjp l మక్తల్ అభివృద్ధి కోసం బిజెపికి అవకాశం ఇవ్వండి ….

బిజెపి అభ్యర్థులు బాల్చేడ్ పావని మల్లికార్జున్

మక్తల్ , ఆంధ్రప్రభ: మక్తల్ మున్సిపల్ అభివృద్ధి కోసం మరోసారి ఎన్నికల్లో బిజెపికి అవకాశం ఇవ్వాలని 12వ వార్డు 13వ వార్డు బిజెపి అభ్యర్థులు బాల్చేడు పావని మల్లికార్జున్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు .మున్సిపాలిటీల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వారు పట్టణ ప్రజలకు ఓలేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినప్పటికీ మున్సిపాలిటీలలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. మున్సిపాలిటీలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు .గతంలో కేంద్రం నిధుల ద్వారా తమ పరిధిలో శక్తికి మించిన అభివృద్ధి చేశామని గుర్తు చేశారు .మరింత అభివృద్ధి కోసం ఎన్నికల్లో మరోసారి బిజెపిని ఆదరించి అవకాశం కల్పించాలని కోరారు. 12వ వార్డు 13వ వార్డుల్లో నెలకొన్న సమస్యల పట్ల స్థానికులుగా తమకు పూర్తి అవగాహన ఉందన్నారు