కవల పిల్లల దినోత్సవం

కవల పిల్లల దినోత్సవం
కరీమాబాద్,ఆంధ్రప్రభ; ఒకే ఇంట్లో కవల పిల్లలు ఒక బాలిక ఒకరు బాలుడు వీరిద్దరూ కనుకుంట్ల రామకృష్ణ ఇంటికి దీపాలు. నగరంలోని బ్యాంక్ కాలనీకి చెందిన కనుకుంట్ల రామకృష్ణ మల్లీశ్వరి దంపతుల కూతురు హంసిక, కుమారుడు పవన్ కుమార్ ఈ కవల పిల్లలు ఇద్దరు ఆరవ తరగతి చదువుతున్నారు. పేరెంట్స్ మాట్లాడుతూ కవల పిల్లల్లో ఒకరు కూతురుమా ఇంటి మహాలక్ష్మి, కుమారుడు వంశోద్ధారకుడుగా భావిస్తున్నామని వారిని చూసుకొని మురిసిపోతున్నామని కవల పిల్లల దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఆనందం వ్యక్తపరిచారు.
చదువుల్లో, ఆటపాటల్లో ఇద్దరూ ఒకే రీతిగా ప్రవర్తిస్తారు ఒకే రకమైన ఆహార పదార్థాలు, ఫ్రూట్స్ ఇష్టపడతారు. వీరిద్దరికీ క్రీడల్లో మక్కువ ఎక్కువ అని అన్నారు. ఇద్దరి ఇష్టాలు కూడా ఒక్కగానే ఉంటాయి వారు ఏది కోరుకుంటే అది మేము అందజేస్తున్నామని పేరెంట్స్ పేర్కొన్నారు.కూతురు కుమారుడు కవల పిల్లలుగా మా ఇంట్లో జన్మించడం మా అదృష్టంగా భావిస్తున్నామని రామకృష్ణ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

