ఈనెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలి
జన్నారం (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామ సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాత్రి విధులు నిర్వహించేందుకు మహిళా వాచ్‌వుమన్ పోస్టు భర్తీకి ఈనెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) బానావత్ రాజేందర్ తెలిపారు.
పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు మాత్రమే ఈ పోస్టుకు అర్హులని, 2026 జూన్ 30 నాటికి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, 1 నుంచి 7వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఎస్‌ఎస్‌సీ ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో పనివేళల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
