కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

నిజామాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కృషి చేస్తుందని కాంగ్రెస్ తో నే అభివృద్ధి సాధ్యమని జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ బాధ్యతల స్వీకరణ కార్య క్రమానికి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధ్యత స్వీకరణ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ను ధర్మపురి సంజయ్ శాలువాతో సన్మానించారు. అనంతరం మేయర్ గా ఎన్నికైన కూరగాయల ఉమారాణి ని, డిప్యూటీ మేయర్ సల్మాన్ తహసీన్ లను ధర్మపురి సంజయ్ సన్మా నించి శుభాకాంక్షలు తెలి పారు.
