మోటర్ కేబుల్ చోరీకి వెళితే..

మోటర్ కేబుల్ చోరీకి వెళితే..
వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలో ఆదివారం రాత్రి పడగల్ ఎక్స్ రోడ్ హనుమాన్ నగర్ వద్ద ఇద్దరు వ్యక్తులు మోటార్ కేబుల్ దొంగిలించే ప్రయత్నం చేయగా గ్రామస్తులు వారిని పట్టుకున్నారు. ఒక వ్యక్తి పరారయ్యాడు. మరొకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
