ఫ్యామిలీ దాబాను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు..

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలోని బాపూనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రోషిని ఫ్యామిలీ దాబాను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం దాబాలోని వంటశాల, ఆహార పదార్థాల తయారీ విభాగం, నిల్వ గదులు, భోజనశాల, వినియోగదారుల కోసం కల్పించిన సౌకర్యాలు, దాబా పరిసరాలను ఆయన  పరిశీలించారు.ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఆహార వ్యాపారంలో రుచితో పాటు పరిశుభ్రత, నాణ్యత అత్యంత ముఖ్యమని అన్నారు.

వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేయడంతో పాటు తాజా, నాణ్యమైన పదార్థాలను మాత్రమే వినియోగించాలని దాబా యాజమాన్యం
షేక్ అశ్వక్ హుస్సేన్, కలిల్ హైమద్, సయ్యద్ అశ్వక్, షేక్ హాబీబ్ లకుసూచించారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రతి వినియోగదారుడికి విశ్వసనీయమైన సేవలు అందించాలని కోరారు.స్థానిక యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ ఇలాంటి వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పడడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. వ్యాపారంలో నిజాయితీ, నాణ్యతను పాటిస్తే వినియోగదారుల ఆదరణ ఎల్లప్పుడూ లభిస్తుందని తెలిపారు.దాబా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన సుదర్శన్ రెడ్డి, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ నగునూరి అనురాధ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హమ్దాన్,జిల్లా గ్రంథాలయాల చైర్మన్ అంతిరెడ్డి రాజి రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఈరంటి లింగం, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు నాగుల రాజు గౌడ్, పలు గ్రామాల సర్పంచులు, వివిధ గ్రామాల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.