ప్రజల పక్షాల అడిగే అర్హత ప్రతిపక్ష నాయకులకు లేదా?

ప్రజల పక్షాల అడిగే అర్హత ప్రతిపక్ష నాయకులకు లేదా?

-ప్రజాపాలన సమావేశం పార్టీ మీటింగ్‌లా నిర్వహించారని కౌన్సిలర్ నీలం రవి విమర్శ

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రజాపాలన సమావేశంపై బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ నీలం రవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన ప్రజలకు, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకుండా సమావేశాన్ని ముగించారని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా మీడియాతో కౌన్సిలర్ నీలం రవి మాట్లాడుతూ, అధికార పార్టీ నాయకులకే మాట్లాడే అవకాశం కల్పించారని తెలిపారు.“ఇది పార్టీ మీటింగ్ అయితే మీరే నిర్వహించుకోండి…కానీ ఇది ప్రజాపాలన కార్యక్రమం కావడంతో ప్రజల తరఫున మేము వచ్చి ప్రశ్నిస్తాం”అని స్పష్టం చేశారు. ప్రజాపాలన వేదిక ప్రజల సమస్యలు వినేందుకు ఉండాలని, ప్రతిపక్ష స్వరాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను ఎప్పటికీ గళమెత్తుతానని ఆయన తెలిపారు. ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది

Leave a Reply