ఊట్కూర్ లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఊట్కూర్ సర్పంచ్ రేణుక భరత్, మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప, పెద్ద జట్రం సర్పంచ్ వాకిటివెంకటేష్, కొత్తపల్లి సర్పంచ్ నర్సిములు, పెద్దపోర్ల సర్పంచ్ బోయిన్ పల్లి కాశమ్మ, తిఫ్రాసు పల్లి సర్పంచ్ విజయలక్ష్మి నరసింహ, బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, సమస్తపూర్ సర్పంచ్ జయప్రకాశ్ రెడ్డి, అమీన్ పూర్ సర్పంచ్ టప్పనాగేష్, ఎడవెల్లి సర్పంచ్ అంజయ్యతో పాటు ఆయా గ్రామాల్లోని శివాజీ యువజన సంఘం నాయకులు యువకులు శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ ధైర్యానికి, దేశభక్తి కీ,వీరత్వానికి, దైవభక్తికి మారుపేరు,శివాజీ మహారాజ్ 17 ఏళ్ల చిరుప్రాయంలోనే యుద్ధం చేసి కోటలను గెలుస్తూ, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, వారి దురాగతాలకు చరమగీతం పాడారనిగుర్తుచేశారు. భారతదేశంలో మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించిన అలాంటి మహనీయుడి స్ఫూర్తి తీసుకొని హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు శివాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
