congress | సింహం సింగల్ గానే వస్తది…

congress | సింహం సింగల్ గానే వస్తది…
మళ్లీ చెబుతున్నా చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవాసం చేయబోతుంది
వైస్ చైర్మన్ మైనారిటీ సాజిదా బేగం ను ప్రకటిస్తున్నాను
ప్రజలు ఇచ్చిన తీర్పును 100% నేను గౌరవిస్తాను..దొరల ఆటలను సాగనీయా
ఆదివాసి బిడ్డ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
congress | ఖానాపూర్,ఆంధ్రప్రభ: ఖానాపూర్ లో రెండవ రోజు నిర్వహించిన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారానికి మళ్లీ గైర్హాజరైన బిజెపి, బీ ర్ స్, కౌన్సిలర్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కాంగ్రెస్ కౌన్సిలర్లతో మంగళవారం రెండవసారి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సింహం సింగల్ గానే వస్తుంది పందులు గుంపులుగా వస్తాయి అని గేర్ హాజరైన ఆ పార్టీ అధినేతలకు హేళన చేశారు. ఖానాపూర్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకుంటుందని బలంగా చెప్పారు.
వైస్ చైర్మన్ మైనారిటీ మా తల్లి సాజిదా బేగం కే అని అన్నారు. దమ్ముంటే బి ఆర్ ఎస్ బిజెపి పొత్తు పెట్టుకోకుండా ఖానాపూర్ మున్సిపాలిటీ కైవాసం చేసుకోవాలని మళ్లీ సవాలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును 100% గౌరవిస్తానని అన్నారు. ఖానాపూర్ అభివృద్ధి చెందకపోవడానికి కొంతమంది దొరలు అడ్డుకుంటున్నారని ఈ విషయం జాన్సన్ నాయక్ అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు.
ఆదివాసి బిడ్డగా నేనున్నాళ్లు దొరల ఆటలను సాగనివ్వనని వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు. కడం నారాయణరెడ్డి భూమిని మాయ మాటలతో కబ్జా చేసిన రవీందర్రావు నీలిగిరి ప్లాంటేషన్ భూమిని బీద ప్రజలకు పంచి పెట్టాలని జేఏసీకి సవాల్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ కైవాసం కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 4 పిల్లర్లుగా మేమున్నాము ఖానాపూర్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు చిన్నం సత్యనారాయణ పోలంపల్లి రమేష్ గొర్రె తిరుమల ఇండిపెండెంట్ కౌన్సిలర్ సాజిదా బేగం పాల్గొన్నారు.
