Polling | ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

Polling | ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
- ఉద్రిక్తతల మధ్య ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక
Polling | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ముగిసినప్పటికీ… ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపికల పట్ల అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌన్సిల్ హాల్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు.
రహస్య ఓటింగ్ చేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. తమకు కోరం ఉందంటూ వారు ఆందోళన చేపట్టారు. నిబంధనల ప్రకారమే ఓటింగ్ నిర్వహించాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పట్టుపట్టారు. అయితే ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తల మధ్య ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక జరిగింది. ఛైర్మన్ గా సుదర్శన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గా శ్యామల ఎన్నికయ్యారు. పరిస్థితి తీవ్రతను ముందే పసిగట్టిన పోలీసులు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
