16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పావని గెలుపు

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 16వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన పావని విజయం సాధించారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య పోరావోరుగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి పావని 592 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి జయమ్మకు 333 ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి పావని 259 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
