congress| రాహుల్ మాట‌ల‌కు అర్ధాలే వేరులే..

congress| రాహుల్ మాట‌ల‌కు అర్ధాలే వేరులే..

  • అప్పుడలా.. ఇప్పుడిలా..?
  • ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా..?
  • మాట‌లు మార్చ‌డంలో రాహుల్‌గాంధీకే చెల్లు!

రాహుల్ గాంధీ ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదేమో. తాజాగా ఆయన లోక్ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం మన దేశ డేటాను అమెరికాకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఏఐ డెవలప్ కు డేటా చాలా కీలకమనీ.. దాన్ని అమెరికా ఇప్పుడు ఉపయోగించుకుంటోందన్నారు. ఇలా మన దేశ డేటాను అగ్రరాజ్యానికి తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కానీ.. ఇదే రాహుల్ గాంధీ గతంలో మరో విధంగా వ్యాఖ్యానించారు. చైనా టెక్నాలజీ విషయంలో భారత్ కంటే ముందు వరుసలో ఉందనీ.. ఇందుకు ఆ దేశం దగ్గర డేటా ఎక్కువగా ఉండటమే కారణం అని చెప్పారు. ఈ విషయంలో చైనాతో పోలిస్తే భారత్ చాలా వెనకబడిందనీ.. డేటా స్టోరేజ్ అభివృద్ది చేసుకోవాలని సూచించారు. సో.. ఒకసారేమో డేటా మన దగ్గర అస్సలూ లేదని చెప్పడం.. మరోసారేమో మన దగ్గర ఉన్న డేటాను అమెరికాకు తాకట్టు పెట్టారని మాట మార్చడం రాహుల్ గాంధీకే చెల్లింది.

Leave a Reply