కూన వ‌నిత సంతోష్‌ ఘ‌న‌ విజ‌యం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిల‌ర్‌గా కూన వ‌నిత సంతోష్ ఘ‌న విజ‌యం సాధించారు. శుక్ర‌వారం జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల హ‌వా కొన‌సాగింది. కాగా కూన వ‌నిత సంతోష్ 900 ఓట్ల‌ భారీ మెజార్టీని సాధించారు. ఈ సందర్భంగా కూన వ‌నిత సంతోష్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి త‌న‌ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఓట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక త‌మ దృష్టి అంతా అభివృద్ధిపై కొసాగిస్తామ‌ని పేర్కొన్నారు. అన్నివ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయ‌మ‌ని చెప్పారు. ఈ విజ‌యం మ‌రింత బాధ్య‌త‌ను పెంచింద‌ని తెలిపారు. అయితే ఎన్నిక‌ల‌కు ముందే టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి కూన వ‌నిత సంతోష్‌ను మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Leave a Reply