makthal | మక్తల్ లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి

makthal | మక్తల్ లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి

మక్తల్ , ఫిబ్రవరి 13 ఆంధ్రప్రభ నారాయణ పేట జిల్లా మక్తల్ పురపాలిక ఎన్నికల కౌంటింగ్ రెండు రౌండ్లలో జరగనుంది.
మొదటి రౌండ్ లో 1,2,3,5,7,8,11, 13…వార్డులు
రెండో రౌండ్ లో
4,9,10,12,14,15,16 వార్డుల పోలింగ్ జరగనుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యింది.
మొదటి రౌండ్ లో 1,2,3,5,7,8,11, 13…పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యింది.1వ వార్డులో 5 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా అందులో బిజెపి అభ్యర్థి బి. రాజశేఖర్ రెడ్డి కి 3 ఓట్లు ,బిఆర్ఎస్ అభ్యర్థి హరికృష్ణకు రెండు ఓట్లు పోలయ్యాయి. అదే అదేవిధంగా 2వ వార్డులో రెండు పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా రెండు ఓట్లు కూడా బిజెపి అభ్యర్థి టప్ప కృష్ణకు పోలయ్యాయి. 3వ వార్డులో మూడు పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా ఒక ఓటు బి ఆర్ ఎస్ అభ్యర్థి జుట్ల శంకర్ కు ఇండిపెండెంట్ అభ్యర్థికి రెండు ఓట్లు పోలయ్యాయి. 7వ వార్డులో రెండు పోస్టల్ బ్యాలెట్లు జారిచేయగా ఒకటి కాంగ్రెస్ అభ్యర్థికి ఒకటి బీఆర్ఎస్ అభ్యర్థికి పోల్ అయ్యాయి. 8వ వార్డులో మొత్తం 6 పోస్టల్ బ్యాలెట్లు విడుదల ఏడు పోస్టల్ బ్యాలెట్ విడుదల చేయగా కాంగ్రెస్ అభ్యర్థి పావనికి నాలుగు ,బి ఆర్ ఎస్ అభ్యర్థికి 1ఓటు , బీజేపీకి రెండు ఓట్లు పోలియ్యాయి. 11వ వార్డులో రెండు పోస్టల్ బ్యాలెట్లు జారీగా రెండో ఓట్లు కూడా బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్యకు పోలయ్యాయి.

Leave a Reply