కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్

కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్

అచ్చంపేట, ఆంధ్రప్రభ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.తాను మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నానంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.

అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదని, సమాజంలోని అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని అన్నారు. మహిళలకు ఓటు హక్కు, కార్మికులకు పని గంటల తగ్గింపు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఆయన పాత్ర అపారమని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అచ్చంపేట అభివృద్ధికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు. పట్టణంలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గౌరీ శంకర్ , అంతటి శివ, తగరం శ్రీను, బాబా షరీఫ్, కో ఆప్షన్ సభ్యులు ఖాదర్, మున్సిపల్ మేనేజర్ రమేష్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply