Elections | బ్యాలెట్లో భవితవ్యం

Elections | బ్యాలెట్లో భవితవ్యం
- మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
- 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు ..
- అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్
Elections | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లను శుక్రవారం లెక్కించేందుకు ఎన్నికల నిర్వహణ అధికారులు సిద్ధమయ్యారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు గురువారం ఆయా స్ట్రాంగ్‌రూంలకు వెళ్లి మరోమారు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి ఓట్లలెక్కింపు పక్రియను ప్రారంభించేందుకు చర్యలను చేపట్టారు. పదకొండు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందని, పోలైన ఓట్లు 20వేలలోపు ఉంటే మధ్యాహ్నం 12గంటలలోపు ఫలితం వెల్లడవనుందని, 20వేలకుపైగా ఓట్లుంటే మధ్యాహ్నం 3గంటల్లోపు ఫలితాలు వెలువడనున్నాయని అధికారులు తెలిపారు.
7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు ..
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ జరిగింది. ఇందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 2,996 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. రేపు ఓట్లను లెక్కించి అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. 16న మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు.
