Notice | దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

Notice | దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

  • లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలి
  • 29 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలి.
  • సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న

Notice | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో దేశవ్యాప్త సమ్మె కరపత్రాలను సంఘ నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరంఉట్నూర్ మండల కేంద్రం ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ అనిత కు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సమ్మె నోటీసు ఇచ్చారు.

ఈ సందర్భంగా సిఐటియు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నాలుగు లేబర్ కోడ్స్ ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Notice |

రైతులకు ఉపాధి చట్టం, వ్యవసాయ చట్టాలను, కార్మిక చట్టాలను మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, వీటిని వెనక్కి తీసుకోవాలని ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఎంపీడీవో కార్యాలయం ముందర సమ్మె బుక్ లేడిస్ ఆవిష్కరణ చేయడం జరిగిందని, ఉట్నూర్ ప్రాంతం నార్నూర్ గాదిగూడ, ఇంద్రవెల్లి,సిఐటియు కార్మిక వర్గం అంతా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉట్నూర్ ఐబీ చౌరస్తా నుండి పీవో కార్యాలయం వరకు ర్యాలీ సభ ఉంటుందని కావున కార్మికులు, ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అర్క వెంకట్రావు, ఉట్నూర్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆత్రం సోనేరావు, ఆత్రం సుందర్, మండల ఉపాధ్యక్షులు గంగమ్మ, మేకల అనంతరావు, మండల నాయకులు కుమ్ర మాధవ్ రావు,సుంకే ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply