పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి సాధించాం..

పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి సాధించాం..

  • మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఉద్యమాలు చేశారని ఉద్యమాల ఫలితంగానే స్వరాష్ట్రం సాధించామనిగుర్తుచేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ చెక్పోస్ట్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమరుల సేవలను వరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణను అంది రంగాల్లో అభివృద్ధి పథంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో కృషి చేశారనిఅన్నారు. పదేళ్లలో మక్తల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిచేసిచూపించానని అన్నారు. బీఆర్ఎస్ సహాయం లో చేపట్టిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుందనిఅన్నారు.

బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ప్రజలకు నాయకులకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానని ధైర్య పడకుండా ఉండాలన్నారు. రెండేళ్లు ప్రతిపక్ష పాత్రలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలనిఅన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి అండతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంలో నల్ల మట్టి ఇసుక మాఫియా కొనసాగుతుందనిఆరోపించారు. నారాయణపేట – మక్తల్ నాలుగు లైన్ల రోడ్డు వేస్తామని హామీ ఇచ్చిన నేటికీ అతిగతి లేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్న అన్నారు. రెండేళ్లు కష్టపడి పని చేస్తే మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవరిమల్లప్ప, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, చిన్నహన్మంతు, మండల ఉపాధ్యక్షులు వడ్ల మొనప్ప, మాజీ సర్పంచ్ సాయిలు గౌడ్, పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, నాయకులు కార్యకర్తలు శివరాజ్ రెడ్డి, కావలి సురేష్, ఇబాదూర్ రెహమాన్, ఆనంద్ రెడ్డి, తరుణ్ రెడ్డి, షేక్ సమీ, చంద్రశేఖర్ గౌడ్ అంజి, ఖాళీక్, గంగాధర్ చారి, భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రహీం తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply