ఎవ్వరి వ్యూహం వారిదే

ఎవ్వరి వ్యూహం వారిదే
నేటి తో ముగియానున్న ప్రచారాలు
చెన్నూరు ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ రాజకీయం వేడెక్కింది నేటి సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం సమయం ముగియానుడడంతో వేకువ జామునుంచే అభ్యర్థులు ప్రచారాలు జోరుగాసాగిస్తున్నారు. 18వార్డులు గల చెన్నూరులో 11న (బుధవారం ) పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చెన్నూరు మున్సిపల్ తో పాటు స్వయన మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం కావడం తో ఇక్కడ అధికార పీఠం దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు సాగిస్తూ రెబల్, ఇండిపెంట్ అభ్యర్థులను తమపార్టీ అభ్యర్థులకు మద్దతు పలికే విధంగా అగ్రనాయకులను రంగంలోకి దింపి రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పట్టికె గత ప్రభత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పట్టణంలో చేసిన అభివృద్ధి పై ప్రజలు విశ్వసిస్తుతున్నారనే నమ్మకమ్మతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు,ప్రధాని మోదీ దేశంలో చేస్తున్న పాలన, సంక్షేమమే గెలిపిస్తాదని నమ్మకం తో బిజెపి అభ్యర్థుల భరోసా,ఏది ఏమైనప్పటికి మరి కొన్ని గంటల్లో ముగియనున్న ప్రచారాల అనంతరం చేయాల్సిన వ్యాహరాల కొరకు వ్యూహరచన చేస్తున్నారు.
