Kareemabad | పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి

Kareemabad | పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి
- టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు
Kareemabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ ; పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం హంటర్ రోడ్ లోని నేత హాస్టల్ భవన్లో, రిటైర్డ్ పద్మశాలి ఉద్యోగుల సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం, రిటైర్డ్ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగ వెంకటేశ్వర్లు,జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోడం రవి ప్రకాష్ ,ప్రధాన కార్యదర్శి గుర్రపు రాజమౌళిహాజరయ్యారు. ఈ సందర్భంగా ఈగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .రాష్ట్ర పద్మశాలి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లాగే రిటైర్డ్ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉండాలని భావించి రిటైర్డ్ ఉద్యోగుల కోసం టి పి ఆర్ యు ఎస్ సంఘాన్ని స్థాపించి పద్మశాలీల ఐక్యత గూర్చి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
పద్మశాలీలందరూ సంఘటితంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చునని అన్నారు. కార్యక్రమంలో టి పి ఆర్ యు ఎస్ జిల్లా అధ్యక్షుడు కుడికాల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి గుండు కామేశ్వరరావు అసోసియేటెడ్ అధ్యక్షుడు గుర్రపు సుధాకర్ రావు ,మంత్రి సతీష్, పూర్ణచందర్రావు కోశాధికారి పడాల సోమయ్య, ఉపాధ్యక్షులు గల్లవెల్లి రవీందర్, మార్త రమేష్ బాబు ,పాసికంటి చంద్రశేఖర్, చిమ్మని రాజన్ బాబు ,మైన వాణిశ్రీ,, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం డిసెంబర్ జనవరి నెలలో రిటైర్డ్ అయిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పద్మశాలి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు హాజరయ్యారు.
