భూపాలపల్లి డివిజన్ స్థాయి డీలర్ల సమీక్ష సమావేశం..

రేగొండ, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి డివిజన్లోని ఏడు మండలాల విత్తన, ఎరువుల మరియు పురుగుమందుల డీలర్లకు శిక్షణ మరియు అవగాహన సమావేశం రేగొండ రైతువేదికలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జె. బాపూరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ.. రాబోవు వానకాలం సీజన్ కు విధిగా విత్తన డీలర్లు విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని, రోజువారీగా స్టాక్ రిజిస్టర్లు అప్డేట్ చేసుకోవాలని, ధరల పట్టికలు రోజువారిగా నమోదు చేయాలని ఆదేశించడం జరిగింది.

అదేవిధంగా రాబోవు వానకాలంకు 8 సన్న రకాలైన వరి విత్తనాలు బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కెఎన్ఏమ్ 1638, హెచ్ఎమ్టి సోనా , జైశ్రీరామ్, డబ్లుజిఎల్ 962, డబ్ల్యూ జియల్ 44, జేజిఎల్ 1798 ప్రభుత్వం సూచిస్తున్నవి. వాడి రైతులు దిగుబడితో పాటుగా బోనస్ పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు. రమేష్, రేగొండ, భూపాలపల్లి, మొగుళ్ళపల్లి, కొత్తపల్లిగోరి, ఘనపూర్, టేకుమట్ల, చిట్యాల మండల వ్యవసాయ శాఖ అధికారులు పెద్ది వాసుదేవ రెడ్డి, సతీష్, సురేందర్ రెడ్డి, సారయ్య, ఐలయ్య, కళ్యాణి, మరియు శ్రీనివాస రెడ్డి అన్ని మండలాల డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply