ఓటర్లతో మాట్లాడుతున్న అభ్యర్థి శనిగరం రజిని నవీన్

ఓటర్లతో మాట్లాడుతున్న అభ్యర్థి శనిగరం రజిని నవీన్
17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థికి మహిళల ఓటర్ల ఆదరణ..
వార్డులో అభ్యర్థి ప్రచారం
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 17వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శనిగరం రజిని నవీన్ కు వార్డులోని మహిళా ఓటర్ల ఆదరణ లభించింది. ఓటర్లు ఆదరిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని బిఆర్ఎస్ పార్టీ 17వ వార్డు అభ్యర్థి శనిగరం రజనీ నవీన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని 17వ వార్డులో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి శాశ్వత పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఓటర్లు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అభ్యర్థి వెంట శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చందుపట్ల నరసింహారెడ్డి, బిఆర్ఎస్ 17వ వార్డ్ నాయకులు చట్ల వెంకటేశ్వర్లు, తోట రవీందర్, మహమ్మద్ అల్తాఫ్, తదితరులు ఉన్నారు.
