చేయూతనిచ్చి చేతి గుర్తును గెలిపించండి..

చేయూతనిచ్చి చేతి గుర్తును గెలిపించండి..

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో తనకు చేయూతనిచ్చి అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్ గా గెలిపించాలని 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీగల రమేష్ ఓటర్లను కోరారు. పుర ఎన్నికల్లో 1వ వార్డు నుంచి బర్లో దిగుతున్న క్రమంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి తారకరామ కాలనీ, అల్లూరి సీతారామరాజు నగర్ లో ఇంటిటా తిరుగుతూ కాంగ్రేస్ ప్రభుత్వం సంక్షేమ గురించి వివరించారు. వార్డు అభివృద్ధి చెందాలంటే తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెసు ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు, ఇంటింటికి 200 ఉచిత విద్యుత్ అందిస్తుందని, చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రజలకు వివరించారు. చేయూతనిచ్చిన చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ వార్డును అభివృద్ధి వైపు తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. కాగా కాలనీ వాసులు అభ్యర్థిని స్వాగతిస్తూ హారతులు ఇచ్చారు.