
8thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా.
8thFebCartoon | ఎట్టకేలకు దిగొచ్చిన ట్రంప్ | భారత్‌తో వాణిజ్య సుంకాలపై అమెరికా వెనక్కి
8thFebCartoon | భారత్–అమెరికా వాణిజ్య సుంకాల వివాదానికి తాత్కాలిక ముగింపు
రష్యాతో భారత్ సంబంధాలే అసలు కారణమా?
ట్రంప్ వెనకడుగు: భారత్‌కు శుభఫలితమా?
భారత్‌పై ఇంతింత పెంచుకుంటూ పోయిన వాణిజ్య సుంకాలను తగ్గించింది అమెరికా. ఈమేరకు శ్వేతసౌధం నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. ఇకపై భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలు పూర్వస్థితికి చేరుకోనున్నాయని వ్యాఖ్యానించింది అమెరికా. నయానా భయానా భారత్‌ను తమ దారిలోకి తెచ్చుకోవాలని చూసిన అమెరికా ప్రయత్నాలు ప్రతికూలం ఫలితాలను ఇవ్వడంతో చివరికి దిగిరావాల్సి వచ్చింది.
భారత్ నుంచి చాలా వస్తువులు అమెరికాకు వెళ్లకపోతే అమెరికన్లకు చుక్కలు కనిపించాయన్నది వాస్తవం. ఇప్పటికే అనేక వస్తువుల కొరతతో అమెరికా తల్లడిల్లుతోంది. ట్రంప్‌పై నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితి తీవ్ర రూపం దాల్చితే అంతర్యుద్ధం తప్పదని ట్రంప్ గారికి కూడా అర్థమై ఉండాలి. అందుకే భారత్‌తో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడమే మేలని భావించారు.
భారత్‌పై ప్రతీకారం సాధించడం ట్రంప్ ఉద్దేశం కాదని ఇదే విషయాన్ని ఆయన పదేపదే అనేక వేదికలపై చెబుతున్నారు కూడా. అసలు ఉద్దేశం రష్యాతో భారత్ వాణిజ్య సంబంధాలను దెబ్బతీయడమే. కానీ భారత్ ఇందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే భారత్‌ది రష్యాతో చిరకాల స్నేహం, శక్తివంతం అయిన వ్యూహాత్మక భాగస్వామ్యం.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు భారత్ నిలిపివేస్తుందని అమెరికా తానే ప్రకటిస్తున్నా, ఈమేరకు భారత్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే విషయాన్ని రష్యా కూడా స్పష్టం చేస్తోంది. భారత్ నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతోంది. ఒకవేళ భారత్ రష్యాతో వాణిజ్య సంబంధాలను తగ్గిస్తే, మరుక్షణమే ట్రంప్ మళ్లీ సుంకాలను పెంచే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే అప్పుడు భారత్‌కు అమెరికానే ఏకైక ప్రత్యామ్నాయం అవుతుంది అన్నది వారి లెక్క.
చపల చిత్తం, చంచల మనస్తత్వం ట్రంప్‌దైతే, ఆధిపత్య ధోరణి అమెరికా వైఖరి. అధికారంలో ఎవరున్నా అమెరికా విధానమిదే. అయినప్పటికీ ప్రస్తుతానికైతే ట్రంప్ దిగొచ్చాడన్నది వాస్తవం. ఇది భారత్‌కు తాత్కాలికంగా అయినా శుభఫలితం అందించిన పరిణామంగా చెప్పుకోవచ్చు.
అనేక మెట్లు దిగి వచ్చి భారత ప్రధాని మోదీతో కరచాలనం చేస్తున్నట్టు సింపుల్‌గా ఒక్క చిత్రంలో చూపించిన ఆంధ్రప్రభ కార్టూన్ ఇది.
గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తున్న ఆంధ్రప్రభ కార్టూన్ ఫీచర్ ఔరా.

