TG | పశువులు అమ్ముకున్నాము ఇందిరమ్మ బిల్లు రాకపాయే

TG | పశువులు అమ్ముకున్నాము ఇందిరమ్మ బిల్లు రాకపాయే

ఇందిరమ్మ L 3 రిపేరిట 8 నెలల నుండి బిల్లులేదు
అడ్డంకులను తొలగించి, నిర్మించిన బేస్మెంట్ బిల్లు రావాలని ఆదివాసుల వినతి

TG | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం, గౌరాపుర గ్రామపంచాయతీ, గంగాపూర్ గ్రామానికి చెందిన కొట్నాక్ రాదా బాయ్, మరియు తేజపూర్ జిపి కి మోహన్ గూడా, కు చెందిన మడవి తాను బాయ్ ఇంద్రమ్మ గృహాలకు గ్రహణం పట్టింది శనివారము ఆంధ్రప్రభ పర్యవేక్షణలో భాగంగా గంగాపూర్ కు చెందిన కొట్నాక్ రాధాబాయి w/0 కోట్నాక కేశవ్, మరియు తేజపూర్ గ్రామపంచాయతీకి మోహన్ గూడ గ్రామానికి చెందిన తాను భాయ్, భర్త హనుమంతుల ఇందిరమ్మ గృహాలు బిల్లు లేక లబోదిబోమంటున్నారు 2025 జులై ఇందిరమ్మ ఫస్ట్ ప్లేస్ యందు మంజూరైనాయి, దీనిని ఆసరాగా తీసుకొని రెండు ఎకరాల 10 గుంటలు భూమి కలిగిన బీద అ దివాసులు, తమ తమ ఎడ్ల జతలను అమ్మి ఇందిరమ్మ గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు.

గత ఎనిమిది నెలలు పూర్తి అయినాయి అనంతరం అధికారులు గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ జే ఈ లు బేస్ మీట్ ఫోటోలు తీసి ప్రభుత్వానికి పంపిన బిల్లు మాత్రం వస్త లేదని ఆదివాసులు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వద్ద వీరు వెళ్లి, తన గోడు వినిపిస్తే ఎంపీడీవో లకు ఫోన్ చేసి బిల్లులు ఇప్పియాలని ఆదేశించారు అయినా వీరికి బేస్మెంట్ కట్టిన డబ్బులు రాక, అటు పొలంలో పశువులు లేక దున్నక చింతిస్తున్నారు ఏదైనా చేసి మా బిల్లులు మాకు అందాలని కోరుతున్నామన్నారు వివరణ,,, ఇందిరమ్మ జె ఈ అంజనేయులు ను ఈ బిల్లుపై వివరణ కోరగా ఇందిరమ్మ ఫస్ట్ ఫేస్ యందు ఎల్ త్రీ కి చెందిన కొందరు లబ్ధిదారులకు బిల్లులు వచ్చాయని మరికొందరికి బిల్లులు రావడం లేదని ఆయన తెలిపారు ఈ విషయంపై నేను హైదరాబాద్ లోనే ఉన్నానన్నారు

Leave a Reply