నూతన కార్యదర్శిగా కాంబ్లే దేవి భీమ్రావు..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు ) మండలంలోని సీతా గొంది పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని, మంచి సేవలందించాలని సీతాగొంది పంచాయతీ సర్పంచ్ కోట్నాక్ బాపూజీ అన్నారు. గ్రామపంచాయతీకి నూతన కార్యదర్శిగా నియామకమైన కాంబ్లే దేవి భీమ్రావు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. నూతన కార్యదర్శి భీమ్రావు కు సర్పంచ్ తో పాటు వార్డ్ సభ్యులు, కరోబార్ లు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి భీమ్రావు మాట్లాడుతూ సర్పంచ్ వార్డు సభ్యుల గ్రామస్తుల సహకారంతో అధికారుల ప్రోత్సాహంతో పంచాయితీ అక్కడికి చేస్తానని ఆయన అన్నారు. అనంతరం పంచాయతీ సమస్యలు తదితర విషయాలపై సర్పంచ్ తో చర్చించారు. కారోబర్ వెడ్మ హనుమంతరావు, వార్డు సభ్యులు మడావి రాధిందర్ కుమార్ పాల్గొన్నారు.
