సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా…

సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా…

  • 11వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి అస్గర్ అలీ

మక్తల్, ఆంధ్రప్రభ : వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని ఈ ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించి మునిసిపల్ కౌన్సిలర్ గా గెలిపించాలని బిఆర్ఎస్ అభ్యర్థిగా 11 వ వార్డు నుండి పోటీ చేస్తున్న అస్గర్ అలీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన తన మద్దతుదారులతో కలిసి వార్డు పరిధిలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ మున్సిపల్ కు ముందు మేజర్ పంచాయతీలో వార్డు సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు.

ఈ ప్రాంతంలో సిసి రోడ్ల నిర్మాణం వీధిలైట్లు వేయించడమే కాకుండా తాగునీటి సమస్య పరిష్కారానికి చేశానని చెప్పారు .తాను అధికారంలో ఉన్న లేకున్నా నిత్యం మీ మధ్య తిరుగుతూ ఉన్నానని మీ అందరి కోసం 11వ వార్డు అభివృద్ధి కోసం పని చేస్తానని చెప్పారు. పనిచేసే వ్యక్తిగా తనను గుర్తించి ఎన్నికల్లో తనను ఆదరించాలని కోరారు. 11న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను కౌన్సిలర్గా గెలిపించవలసిందిగా బీఆర్ఎస్ 11వ వార్డు అభ్యర్థి అస్గర్ అలీ విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో అస్గర్ అలీ మద్దతు దారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.