8వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతా

8వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతా

  • బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు

జనగామ, ఆంధ్రప్రభ : జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 8వ వార్డును అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని 8 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు అన్నారు . శుక్రవారం 8వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం ప్రజల కోరిక మేరకు ఎనిమిదవ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని తెలిపారు.

వార్డు సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులు చేపడతామని ఆమె తెలిపారు. బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని రోడ్ల వెడల్పు ,డివైడర్లు ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్, మురికి కాలువల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల ఆదరణ బాగుందని, తమ గెలుపు ఖాయమని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి డాక్టర్ సుధా సుగుణాకర్ రాజ్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి, వార్డ్ అధ్యక్షులు కడారి శ్రీనివాస్ ,గులాం, జస్సికా, నర్సింగ్ యాదవ్, తొట్ట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.