ఆదరించండి …అభివృద్ధి చేసి చూపిస్తా..!

ఆదరించండి …అభివృద్ధి చేసి చూపిస్తా..!

  • కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వండి
  • 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి

మోత్కూర్, ఆంధ్రప్రభ : ఈనెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నిక ల్లో ఒక్కసారి 8 వ వార్డు కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. శుక్రవారం పోతాయిగడ్డ,శ్రీ వెంకటేశ్వర కాలని,నార్కెట్ పల్లి రూట్లో ఇంటింటా ప్రచారం చేశారు.తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్ధి శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ.తనకు ఒక్కసారి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే …ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీనీచ్చారు.

8వ వార్డు లో నెలకొన్న సమస్యలన్నింటిని 5 ఏండ్ల కాలపరిమితి లో దశల వారిగా సమస్యలను పరిష్కరించి మీముందుకు వస్తామని ఓటర్లకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, వార్డుకు ప్రత్యేకంగా నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పెద్దల సహకారంతో కాలనీ అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి దోహదపడుతామన్నారు.

వార్డులో నెలకొన్న సమస్య లు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు పెద్దల సహకారంతో పరిష్కరిస్తామన్నారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఆయన వెంట కాలనీవాసులు, కాంగ్రెస్ కార్యకర్తలు బద్ధం నాగార్జున రెడ్డి, బండారు వెంకట్ రెడ్డి, బాధే లక్ష్మణ్,పి స్వామి రాయుడు,ముప్ప వెంకట్ రెడ్డి, మడిపెళ్లి రంగయ్య,లోడే రాజు,తాడూరి లక్ష్మి నర్సయ్య,పసునూరి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply