లింగాపూర్ లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

లింగాపూర్ లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
లింగాపూర్, ఆంధ్రప్రభ: లింగాపూర్ మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ఆడె రక్కబాయి లక్య నాయక్, స్థానిక సర్పంచ్ జాధవ్ రాజశేఖర్ లు మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా 2001లో జలదృశ్యంలో బీఆర్ఎస్ పురుడుపోసుకున్నదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అలుపెరుగని పోరాటంతో స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి సరికొత్త చరిత్ర లిఖించిందన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ కిషన్. లకావత్ గణపత్.పవార్ రవీందర్. జాటోత్ లింగన్న. రాథోడ్ ఈశ్వర్.జాధవ్ రమేష్ జాటోత్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
