ఓటు వేసే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది..

ఓటు వేసే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది..

  • ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి: ఫిబ్రవరి 5(ఆంధ్రప్రభ): ఓటు వేసే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని 13, 14, 15 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా టిపిసిసి అధికార ప్రతినిధి ఠాగూర్ బాలాజీ సింగ్, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలిసి చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి ఓటర్లు మోసపోవద్దని, అధికార కాంగ్రెస్ కు అండగా నిలవాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కల్వకుర్తి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఏది ఏమైనా కల్వకుర్తి మున్సిపల్ పీఠాన్ని కైవాసం చేసుకుంటామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అభ్యర్థులు బృంగి ఆనంద్ కుమార్, కొలుకుల హైమావతి శ్రీనివాసులు, కుడుముల అస్మిత చంద్రకాంత్ రెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రామకృష్ణ, అయ్యా ఖాన్, గోపాల్, జంగయ్య గౌడ్, దున్న భాస్కర్, ఆరిఫ్, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply