స‌మ‌య పాల‌న పాటించ‌ని సార్లు

మదనాపురం త‌హ‌సిల్దార్ కార్యాలయంలో కుర్చీలు ఖాళీ

విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం
ఇబ్బందులు ప‌డుతున్న‌రైతులు

కొత్తకోట మే 23 (ఆంధ్ర ప్రభ): ఉమ్మడి కొత్తకోట మండల పరిధిలో నూతనంగా ఏర్పడిన మదనాపురం మండలం తహసిల్దార్ కార్యాలయంలో సమయ పాలన పాటించని అధికారుల నిర్లక్ష్యనికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మదనాపురం తాసిల్దార్ రేపోలు రాజు తోపాటు మిగతా అధికార యంత్రం కూడా శనివారం ఉదయం 11 గంటలు అయిన ఆఫీసుకు రాకపోవడంతో కార్యాలయన్నికి వచ్చు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు. విధులు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్టు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న జిల్లా అధికార యంత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.