జర్నలిస్టును పరామర్శించిన ధరణి సేవ సభ్యులు..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : జర్నలిస్ట్ సత్యమును ధరణి సాయి సేవా సంఘం సభ్యులు మంగళవారం పరామర్శించారు. ఇటీవల అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న పాత్రికేయుడు బత్తుల సత్యమును ధరణి సభ్యులు పరామర్శించి షిర్డీ సాయిబాబా ప్రసాదం అందించి త్వరగా కోలుకొని ఆరోగ్యకరమైన సమాజాభివృద్ధికి తన వంతు సేవలు అందించాలని వ్యవస్థాపకులు సుధాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. షిర్డీ సాయిబాబా ఆశీస్సులు, కృప ఎల్లవేళలా సత్యం పైన ఉండాలని వారు అన్నారు.
