Crime | కొత్తూరు దేవ‌స్థానంలో చోరీ…

Crime | కొత్తూరు దేవ‌స్థానంలో చోరీ…

  • ప‌రారీలో నిందితుడు…

Crime | మాచర్ల (పల్నాడు జిల్లా) ఆంధ్రప్రభ : విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడి పరార‌య్యాడు. పలు చోరి కేసుల్లో నిందితుడిగా ఉన్న పిడుగురాళ్లకు చెందిన జానీ మాచర్ల మండలం కొత్తూరులోని దేవస్థానంలో ఆరు లక్షలు విలువ చేసే వెండి నగలు, ఆభరణాలు చోరీ చేశాడు.

ఈ నెల రెండో తారీఖున పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు జాని విజయపురి సౌత్ పిఎస్ లాకప్ నుండి పోలీసుల కళ్లుగప్పి రెండు రోజుల క్రితం పరారీలో ఉన్నాడు. నిందితుడు జానీ పరారీలో ఉన్న‌ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జానీ కోసం విజయపురి సౌత్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.