24 గంటలు అందుబాటులో ఉంటా

24 గంటలు అందుబాటులో ఉంటా
- వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా
- 10 వ వార్డు బీజేపీ అభ్యర్థి వినిషా లక్ష్మి
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిజాయితీ,సమస్యలు పరిష్కరించాలనే తపన,ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే సంకల్పం వస్తున్న తనను ఆదరించాలని బిఆర్ఎస్ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి వినిషా లక్ష్మి కోరారు.గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్ మహాశయులను బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి వినిషా లక్ష్మి మాట్లాడుతూ వార్డులో డ్రైనేజీ,రోడ్ల తోపాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో 10 వార్డు గొల్లపేట్ ఎన్ రెడ్డి ఖాళీలను మున్సిపాలిటీ లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు .అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి శూన్యమని గుర్తు చేశారు.బీజేపీ పార్టీ కి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని కాంగ్రెస్ పరిపాలన పై ప్రజలు పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుపై ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని పదో వార్డు బీజేపీ అభ్యర్థి వినిషా లక్ష్మి కోరారు.అభివృద్ధి చేసే బాధ్యతగా తాము తీసుకుంటామని పేర్కొన్నారు. ఆమెకు ప్రచారంలో ఇంటింటా ప్రజలు బ్రహ్మరథం పట్టారు
