ప్రజా సేవ కోసం సరిత గోవింద్ రావును గెలిపించండి
మక్తల్ , ఆంధ్రప్రభ ; మా కుటుంబానికి ప్రజాసేవ పరమావధి అభివృద్ధి మా అభిమతం అందుకే మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సరిత గోవింద్ రావును భారీ మెజారిటీతో కౌన్సిలర్ గా గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.శుక్రవారం 13వ వార్డు పరిధిలో సరిత గోవింద్ రావును ఆదరించి ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిలర్గా భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ విస్త్రుతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఎన్నికల్లో తనను ఎందుకు గెలిపించాలి తాను గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తాను అనే అంశాలను ఓటర్లకు వివరించి మద్దతు కోరారు. అభివృద్ధి సంక్షేమం కోసం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మక్తల్ పట్టణ ప్రజలు అండగా నిలవాలని కోరారు .స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయల వ్యయంతో పట్టణంలో సిసి రోడ్లు డ్రైనేజీ మంచినీటి పైప్ లైన్ వంటి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అన్నారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలన్న పట్టణం మరింత అభివృద్ధి జరగాలన్న కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది అన్నారు. మంత్రి స్థానికుడు కావడం వల్ల మక్తల్ పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఈ అవకాశం జారవిడుచుకుంటే పట్టణం ఎన్నడూ అభివృద్ధి జరిగదన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు . 13వ వార్డు పరిధిలో ప్రతి గల్లీలో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మురుగు కాలువల నిర్మాణం తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల వల్ల ఏదీ సాధ్యం కాదని వారి మాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు .ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి సరిత గోవిందరావును భారీ మెజారిటీతో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించి మంత్రి శ్రీహరికి కానుక ఇవ్వాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం గోవిందరావు, ఎస్ .రమేష్ రావు, సురేంద్ర చారి ,సాగర్ అయ్యా,హన్మేష్ చారి ,వాదిరాజ్ , మార్కెట్ డైరెక్టర్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు .
