ఆశీర్వదించండి.. గెలుపు అందించండి..

ఆశీర్వదించండి.. గెలుపు అందించండి..

  • 27వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మురళీమోహన్ (అప్పి) ప్రచారం..
  • అధికార పార్టీ అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది(అప్పి)

షాద్ నగర్, ఆంధ్రప్రభ : గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయుధంగా ప్రజల ముందుకు వచ్చానని, ప్రజలు తనకు విజయాన్ని అందించి ఆశీర్వదించాలని 27వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మురళీమోహన్ (అప్పి) అన్నారు. పట్టణంలోని 27వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వారర్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా తన పనితనాన్ని చూపగలిగానని, మరో అవకాశం ఇస్తే తప్పనిసరిగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

ఈ దిశగా తనకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే నిరంతరం అందుబాటులో ఉండి వారికి సేవలు అందిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు.

Leave a Reply