Makthal | బీ ఫారాలు అందజేసిన అభ్యర్థులు

Makthal | బీ ఫారాలు అందజేసిన అభ్యర్థులు
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో నామినేషన్ ల ఉపసంహరణ, బీఫారాలు అందజేత సందర్భంగా ఇవాళ బిజెపి అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ బి ఫారాలను అందజేశారు. 16 వార్డులకు గాను 14 వార్డుల్లో పోటీ చేసిన బిజెపి అభ్యర్థులు ఒక్కొక్కరుగా ఎన్నికల అధికారికి తమ బీఫారలను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కొండయ్య, ఎన్నికల పరిశీలకులు అమర్ నాథ్ తోకలిసి మాట్లాడారు. మరోసారి మక్తల్ మున్సిపాలిటీ పై కమలం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో మున్సిపాలిటీగా ఏర్పడిన మొదటిసారి బిజెపి అధికారం చేపట్టామని తిరిగి రెండోసారి ఎన్నికల్లోను తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించి మరోసారి తమకు మద్దతు ఇవ్వవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కర్నిస్వామి, బాల్చేడ్ మల్లికార్జున్, బి రాజశేఖర్ రెడ్డి, బాల్చేడ్ పావని మల్లికార్జున్, అఖిల రాజశేఖర్ రెడ్డి, జజి.బలరాం రెడ్డి, సుకన్య చంద్రశేఖర్, విద్యాసాగర్, రాజాగౌడ్, కుర్వ లింగం, బ్యాటరీ రాజు, నగరేష్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
