ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులుగా పోలే రాజు..

ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులుగా పోలే రాజు..

ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఊరుకొండ మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఉరుకొండ మండల కేంద్రానికి చెందిన ఉప సర్పంచ్ పోలే రాజు ఎన్నికయ్యారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేతుల మీదగా ఎన్నిక పత్రం అందుకున్నారు. అనంతరం మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి, పోలే రాజును తన కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎన్నికైన రాజు మాట్లాడుతూ.. ఈ అవకాశం నాకు కల్పించి మద్దతు తెలిపిన మండల ఉప సర్పంచులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామాలలో ఉన్న సమస్యల పై, మండల సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు రమేష్ నాయక్ తో కలిసి మండలంలోని సమస్యల పై, వార్డు సభ్యుల సమస్యల పై స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.