విద్యార్థులు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి..
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి..
- పదో తరగతి ఫలితాల్లో 550 మార్కులకు పైగాసాధించాలి..
- అదనపు గదుల మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి.
- పురుగుల బియ్యం తిరిగి పంపించి వేరే బియ్యం తెప్పించండి.
- త్రిప్రాస్ పల్లి వంట ఏజెన్సీ నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం.
- అర్థం కాని విషయాలను మళ్లీ టీచర్ ను అడిగి తెలుసుకోండి.
- నారాయణపేట కలెక్టర్ సిహెచ్ ప్రియాంక.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించడంతోపాటు తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని నారాయణపేట కలెక్టర్ సిహెచ్ ప్రియాంకసూచించారు.విద్యార్థులుపదోతరగతి వార్షిక ఫలితాల్లో అందరూ విద్యార్థులు 550 మార్కులకుపైగా సాధించాలన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనితిఫ్రాస్ పల్లి, ఊట్కూర్ జిల్లా పరిషత్ పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, శ్రీరామ్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలుఆకస్మికంగాతనిఖీ చేశారు.

ముందుగా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. లెక్కలుసులభంగా ఎలా చేయాలో బోర్డు పై చేసి చూపించారు. ఊట్కూర్ మండలంలోని తిప్రాస్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ఆకస్మికంగాతనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైబ్రెరీనీ, మధ్యాహ్న భోజనానికి వినియోగించే నిత్యవసర సరుకులనుపరిశీలించారు. మెనూ పాటించక పోవడంపై వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోని 2, 4 వ తరగతి గదుల్లోకి వెళ్ళి బోర్డుపై లెక్కలు చేసిచూపించారు.
ఊట్కూర్ మండల కేంద్రంలోని పాఠశాలల సందర్శన…

ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ వీధిలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ పాటించాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో బడి బాట కార్యక్రమం ద్వారా ఎన్ రోల్ మెంట్ ఎంత జరిగిందని హెచ్ ఎం లను అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్ నగర్ పాఠశాలలో బియ్యం పరిశీలించిన కలెక్టర్ బియ్యంలో పురుగులు ఉన్నాయని, బియ్యం బస్తాలను తిరిగి పంపించి, వేరే బియ్యం బస్తాలను తెప్పించుకోవాలని ఆ పాఠశాల హెచ్ ఎం ను ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయురాలు చెబుతున్న ఇంగ్లీష్ పాఠం బోధన తీరును పరిశీలించారు. అర్థం కానీ విషయాలను మళ్ళీ టీచర్ ను అడిగి చెప్పించుకోవాలని విద్యార్థినులకు సూచించారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అందరూ 550 మార్కులకు పైగా సాధించాలన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతనుపరిశీలించారు. చివరగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి కంప్యూటర్ గదిని పరిశీలించారు. పదో తరగతి గదిలో హిందీ పాఠం బోధన విధానాన్ని చూసి, హిందీలో విద్యార్థులకు ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు. పాఠశాలలో మరుగు దొడ్ల ను చూశారు. అందుబాటులో ఉన్న మరుగుదొడ్ల ను వినియోగంలోకి తేవాలన్నారు.
పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో మరికొన్ని మరుగు దొడ్లు, అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయించాలని ఎంపీడీవో కు సూచించారు. పక్కనే ఉన్న ఉర్దూ మీడియం తరగతిని పరిశీలించారు. ఉర్దూ మీడియం కొనసాగుతున్న తరగతి గదులు శిథిలావస్థకు చేరాయని గ్రామ సర్పంచ్,రేణుకా భరత్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊట్కూర్ తహసిల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఎంపీవో బాలాజీ, ఆర్ ఐకృష్ణారెడ్డి, సర్పంచ్ ఎం.రేణుక భరత్, ఉప సర్పంచ్ ఆర్. రమేష్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు,ఆయా పాఠశాలల హెచ్ ఎంలు తదితరులు పాల్గొన్నారు.
