Electronics | ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు

Electronics | ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు
- రక్తదానంతో ప్రాణరక్షణ, ఆరోగ్యవృద్ధి…
- ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు…
- మైలవరంలో భారీ రక్తదాన శిబిరం…
Electronics | మైలవరం, ఆంధ్రప్రభ : రక్తదానంతో అపాయంలో ఉన్న వారి ప్రాణాలు రక్షించుటతో పాటు రక్తదానం చేసిన వారికి కూడా ఆరోగ్యవృద్ధి కలుగుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు మైలవరం పట్టణంలో, మైలవరంలోకి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.
తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు లంకా లితీష్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. యువకులు అధికసంఖ్యలో రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మహాదేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జల్లి కృష్ణను పరామర్శించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పాల్గొని కేకును కట్ చేశారు. నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తొలుత స్వర్గీయ, అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడానికి నారా లోకేష్ సర్వశక్తులు ఒడ్డిస్తున్నారని అన్నారు. తాతకు తగిన మనుమడిగా, తండ్రికి తగిన తనయుడిగా లోకేష్ పాలనలో టెక్నాలజీతో నూతన ఒరవడికి శ్రీకారం చూట్టారని అన్నారు.

ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. విద్యారంగంలో కూడా ఆయన ఆలోచనలు పేదల బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయన్నారు. మంత్రి నారా లోకేష్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

భగవంతుని ఆశీస్సులు లోకేష్ కి ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి ఘనంగా స్వాగతం లభించింది. ప్రజా అవసరార్ధం టీడీపీ నాయకులు వేముల బాబు ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకరును ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

